సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని statue of equality Ramanujacharya
ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకోనున్నారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రలో మూడుగంటలపాటు ఉండనున్నారు. శ్రీలక్ష్మి నారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు. సమతామూర్తి కేంద్ర విశిష్టతను ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్ల దర్శనం, విష్వక్సేనుడి యాగంలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధానిమోదీ చేరుకున్నారు. ముచ్చింతల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చినజీయర్‌స్వామి స్వాగతం పలికారు. తిరునామాలు, పంచెకట్టుతో ప్రధాని మోదీ శ్రీ లక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ముచ్చంతల్‌లోని యాగశాలలో ప్రధాని మోదీ ప్రధాని పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామి ఇచ్చిన కంకణాన్ని మోదీ ధరించారు. అనంతరం సమతామూర్తి విగ్రహ ప్రాంగనా