సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని statue of equality Ramanujacharya


 ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకోనున్నారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రలో మూడుగంటలపాటు ఉండనున్నారు. శ్రీలక్ష్మి నారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు. సమతామూర్తి కేంద్ర విశిష్టతను ప్రధాని మోదీకి చినజీయర్‌ స్వామి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్ల దర్శనం, విష్వక్సేనుడి యాగంలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు  ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధానిమోదీ చేరుకున్నారు. ముచ్చింతల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చినజీయర్‌స్వామి స్వాగతం పలికారు.  తిరునామాలు, పంచెకట్టుతో ప్రధాని మోదీ శ్రీ లక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ముచ్చంతల్‌లోని యాగశాలలో ప్రధాని మోదీ ప్రధాని పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. చినజీయర్‌ స్వామి ఇచ్చిన కంకణాన్ని మోదీ ధరించారు. అనంతరం సమతామూర్తి విగ్రహ ప్రాంగనానికి మోదీ చేరుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108  దివ్య దేశాలను సందర్శించారు. 108 దివ్య దేశాల విశిష్టతను చినజీయర్‌ స్వామి ప్రధానికి వివరించారు.  రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు.  ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. రామానుజ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ..  శ్రీరాముడు వ్రత సంపన్నుడని కొనియాడారు. శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడని ప్రశంసించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భరతమాత తలెత్తుకొని చిరునవ్వులు చిందస్తోందని పేర్కొన్నారు. సర్వ మానవ సౌభ్రాతత్వం భారతదేశ లక్షణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వెయ్యేళ్ల క్రితమే సమానత్వ భావనను రామానుజాచార్యులు చెప్పారని గుర్తు చేశారు. దివ్యక్షేత్రం కోసం చినజీయర్‌ స్వామి భక్తులందరిని ఏకం చేశారని, రామానుజాచార్య సమతాస్ఫూర్తిని ప్రధాని అమలు చేస్తున్నారని అన్నారు. ముచ్చింతల్‌లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజే రామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగిందని తెలిపారు. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని అన్నారు రామానుజాచార్య ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి: మోదీ

సాక్షి, హైదరాబాద్‌: రామానుజాచార్యుల విగ్రహం జ్జానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కూడా రామానుజాచార్యుల ప్రవచనాలనే చెప్పారని గుర్తు చేశారు.


‘మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకం. గురువే ధ్యాన కేంద్రం. 108 దివ్య దేశ మందిరాలను ఇక్కడ చూశాను. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగింది. సమాజంలో అంతరాలను విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. పోచంపల్లికి ప్రంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది’ అని పేర్కొన్నారు. సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అదరూ సమానంగా అభివృద్ధి చెందాలని అన్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉజ్వల్‌ పథకం, జన్‌ధన్‌, స్వచ్ఛ్‌ భారత్‌ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని తెలిపారు


‘దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి. దేశమంతటా రామానుజాచార్యులు పర్యటించారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోంది. శాతవాహనులు, కాకతీయులు, రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఏర్ప్టాటు చేసిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 54 ఫీట్ల ఎత్తున్న భ‌ద్ర‌వేది బేస్‌పై అమ‌ర్చిన సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చారు. అంతకు ముందు స్వర్ణ మూర్తికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమతామూర్తి స్టాచ్యూ కూర్పొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం కావడం విశేషం. శ్రీ రామనగరంలో కొలువుదీరిన ఈ సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలు నిర్మించారు. రామానుజాచార్యుల విగ్రహ

Comments